సంవత్సరం మారినా దరిద్రం మారలే.. ఆర్‌ఆర్‌ఆర్‌ పై నెటిజన్ల స్పందన ఇదే!

స్టార్ డైరెక్టర్ జక్కన్న సినిమాల రిలీజ్ డేట్లు గతంలో మారిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విషయంలో మాత్రం రిలీజ్ డేట్ మారడం పదేపదే జరుగుతోంది.

కొత్త సంవత్సరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాయిదా అంటూ ప్రముఖ న్యూస్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఊహించని స్థాయిలో ఆవాంతరాలు ఎదురవుతూ ఉండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాయిదాకే మేకర్స్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

మరికొన్ని గంటల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్ సైతం అధికారికంగా ఈ మేరకు ప్రకటన చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకోవడం లేదు.

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వార్త ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ను మాత్రం హర్ట్ చేస్తోంది.మరికొన్ని రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై తారక్, చరణ్ ను చూడాలని భావించిన అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.

Netizens Shares Funny Memes Rrr Movie Release Postpone , Rrr Movie , Rrr Movie
Advertisement
Netizens Shares Funny Memes Rrr Movie Release Postpone , Rrr Movie , Rrr Movie

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాయిదా వార్తల గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ ప్రొడ్యూసర్ దానయ్య గ్రేట్ అని ఇంకో నిర్మాత అయితే సినిమాను మధ్యలోనే వదిలేసిపోయేవాడని కామెంట్లు చేశారు.మరొక నెటిజన్ రిలీజ్ డేట్ గురించి టెన్షన్ పెట్టవద్దని క్లారిటీ కావాలని పోస్ట్ పెట్టారు.మరొక నెటిజన్ సంవత్సరం మారినా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్ కు దరిద్రం మాత్రం మారలేదని కామెంట్లు పెట్టారు.

Netizens Shares Funny Memes Rrr Movie Release Postpone , Rrr Movie , Rrr Movie

ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజయ్యే సమయానికి ముసలోడిని అవుతానని ఒకరు కామెంట్ చేస్తే ఎన్టీఆర్ తర్వాత మూవీ షూటింగ్ మొదలుపెట్టాలని మరొకరు సూచించారు.రాజమౌళితో సినిమా అంటే ఇంతేనని సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చెప్పలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేసినా నిర్మాతకు పది నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు నష్టమని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు