Lakshmi Pranathi : లక్ష్మీ ప్రణతిని దారుణంగా తిట్టిపోసిన నెటిజన్స్.. అసలేం జరిగిందంటే?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ).ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Netizens Insulted Lakshmi Pranathi Badly What Actually Happened-TeluguStop.com

పద్ధతిగా, మౌనంగా, అమాయకంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.ఇక ఈమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో పరిచయం లేదు అని చెప్పాలి.

మామూలుగా ఇతర హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆ వేదిక ద్వారా తమ పరిచయాన్ని పెంచుకున్నారు.కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండనట్లు కనిపించింది.

ఒక స్టార్ హీరో భార్యగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు సోషల్ మీడియా( Social media )తో పని లేదంటే ఆమె ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.ఇక ఎప్పుడైనా సందర్భం ఉంటేనే ఎన్టీఆర్ తో పాటు బయట కనిపిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫంక్షన్లలో కనిపిస్తూ ఉంటుంది.ఇక ఆ సమయంలోనే ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది.

అందుకే చాలామంది అభిమానులు ఎన్టీఆర్ భార్యని చూసి ఫిదా అవుతుంటారు.

ఇంటిపట్టునే ఉంటూ భర్త, పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది ప్రణతి.

ఇక ఎన్టీఆర్( JR ntr ) కూడా ఈ ఫోటోలను సందర్భం వచ్చినప్పుడు పంపిస్తూ బాగా వైరల్ చేస్తూ ఉంటాడు.ఎన్టీఆర్ కూడా ప్రణతి గురించి ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాడు.

ఇప్పటికీ ఎన్టీఆర్ ద్వారానే ప్రణతి ఏంటో తెలిసిపోయింది.

Telugu Oosaravelli, Rabhasa, Tamanna, Tollywood-Latest News - Telugu

ఇక ఆమధ్య ఆర్ఆర్ఆర్ ( RRR )సినిమా అవార్డు ఫంక్షన్లలో మాత్రమే తన భర్తతో కనిపించింది ప్రణతి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఈమెను గతంలో కొంతమంది బాగా తిట్టినట్టు తెలిసింది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.ఎన్టీఆర్ పెళ్లి చేసుకోక ముందు మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నాడు.

Telugu Oosaravelli, Rabhasa, Tamanna, Tollywood-Latest News - Telugu

ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులవరకు ఆయనకు అసలు కలిసి రాలేదు.దానికి కారణం లక్ష్మీ ప్రణతి అంటూ బాగా కామెంట్ చేశారు.పెళ్లి తర్వాత ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఊసరవెల్లి సినిమా( Oosaravelli ) నుంచి రభస సినిమా వరకు అన్ని ఫ్లాప్ అయ్యాయి.దీంతో ప్రణతిని టార్గెట్ చేసి కొన్ని నెగిటివ్ కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ కు ఆమె వల్ల అదృష్టం కలిసిరాలేదని అదే సమయంలో కెరీర్ పరంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని దారుణంగా కామెంట్లు చేశారు.

Telugu Oosaravelli, Rabhasa, Tamanna, Tollywood-Latest News - Telugu

ఇక ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో ప్రణతి చాలా ఫీలయ్యిందని తెలిసింది.దాంతో ఎన్టీఆర్ ఇటువంటివన్నీ సహజమే అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడట.ఆమె చాలా సెన్సిటివ్ కావటంతో ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయంలో ఆమె యాక్టివ్ గా కనిపించదు అని తెలిసింది.ఇక ఇప్పుడు ఆయన సక్సెస్ ల మీద సక్సెస్ లతో దూసుకుపోవటంతో ప్రణతి ఎన్టీఆర్ కు అదృష్ట దేవత అంటూ తెగ పొగుడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube