తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష ( Varsha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆపై జబర్దస్త్ కి( Jabardasth ) ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇకపోతే వర్ష ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే పలు పండుగ ఈవెంట్ లలో చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది.
అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్( Comedian Emmanuel ) తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత ఫేమస్ అయ్యింది వర్ష.
వీరిద్దరికీ పెళ్లి కూడా చేసిన విషయం తెలిసిందే.తెలుగు బుల్లితెరపై రష్మి సుధీర్ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు వర్ష ఇమ్మాన్యుయేల్.ఇలా ఉంటే వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేయడంతో పాటు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రగడ సినిమాలోని అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగ అనే పాటకి చిరుతపులి లాంటి పొట్టి గౌనుతో అలా ర్యాంప్ వాక్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.అయితే ఈ రీల్ కి రెండు రోజుల్లోనే 1.7మిలియన్ వ్యూస్ వచ్చాయి.
అయితే వర్షని కొంతమంది జూనియర్ సమంత( Junior Samantha ) అని అంటారు.మరికొంతమంది అసలు అమ్మాయేనా అని కూడా అంటారు.అయితే ఎవరెలా అన్నా కూడా అవి నెటిజన్లకి నచ్చేస్తుంటాయి.
అయితే తాజాగా వర్ష తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన ఈ రీల్ కి వ్యూస్ మాత్రమే కాదు కామెంట్లు బోలెడు వచ్చాయి.అందులో పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా రావడంతో ఈ రీల్ మరింతగా పాపులారిటీ తెచ్చుకుంది.
సూపర్, నైస్, జూనియర్ సమంత, ఏంజిల్, బ్యూటిఫుల్ అంటు కొందరు పాజిటివ్ కామెంట్లు చేయగా నీ కన్నా ఆ ఇమ్మాన్యుయల్ గాడే నయం కదా అని ఒకరు కామెంట్ చేయగా.లోపల ఏం లేదు.
డొల్ల అని మరొకరు కామెంట్ చేశారు.సముద్రంలో దొరుకుతుంది ఉప్పు మా అక్క నిప్పు అని ఒకరు కామెంట్ చేశారు.
ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తూ రెచ్చిపోతున్నారు నెటిజన్స్.