100 రూపాయలు సంపాదిస్తుంటే అందులో 10 రూపాయలు అయినా దానం చేసే మంచి గుణం కొంతమందిలో మాత్రమే ఉంటుంది.సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోలు చాలామందే ఉన్నా తమ సంపాదనలో 2 శాతం పేదవాళ్ల కోసం ఖర్చు చేయడానికి చాలామంది వెనుకడుగు వేస్తారు.
స్టార్ హీరో గోపీచంద్( Star Hero Gopichand ) కూడా ఆ జాబితాలో ఉంటారనే చెప్పాలి.పదుల సంఖ్యలో పిల్లల్ని చదివిస్తున్నా గోపీచంద్ ఆ విషయాలను ప్రచారం చేసుకోవడం లేదు.
అలీతో సరదాగా షోలో అలీ వెల్లడించడం ద్వారా గోపీచంద్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అభిమానులకు తెలిసింది.గోపీచంద్ చాలామంది పిల్లలను చదివిస్తున్నా ఆ పిల్లల్లో చాలామందికి తమను గోపీచంద్ చదివిస్తున్నారని కూడా తెలియదట.
గోపీచంద్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గోపీచంద్ పారితోషికం 8 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్( Gopichand Remuneration ) లో ఉందని సమాచారం అందుతోంది.గోపీచంద్ కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన భీమా సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.గోపీచంద్ భీమా సినిమా( Bhimaa Movie )కు 14 నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాల్లో సీటీమార్ మినహా ఏ సినిమా సక్సెస్ సాధించలేదు.
గోపీచంద్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గోలీమార్ తర్వాత గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా( Police Officer ) నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.గోపీచంద్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.సినిమా సినిమాకు గోపీచంద్ రేంజ్ పెంచుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.గోపీచంద్ రియల్ హీరో అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.