స్విగ్గీ డెలివరీ ఏజెంట్స్ ( Swiggy Delivery Agents )టైట్ టైమ్ లిమిట్‌లో ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.వీరిలో చాలామంది కస్టమర్లు కోసం రిస్కులు చేస్తుంటారు.
తాజాగా ఒక డెలివరీ బాయ్ ఆకలితో ఉన్న కస్టమర్ కోసం ఏకంగా 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాడు.అది కూడా అర్థరాత్రి సమయంలో! అతను చూపిన కనికరమైన చర్య ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా మంది వ్యక్తుల హార్ట్స్ టచ్ చేస్తోంది.
కస్టమర్ యాప్‌లో తెలియక రాంగ్ అడ్రస్ అందించినా, దానివల్ల 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చినా, సదరు డెలివరీ బాయ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు.ఆకలితో ఉన్న కస్టమర్‌కు ఆహారం అందించడానికి అర్ధరాత్రి వేళ చలితో వణుకుతూ స్కూటర్‌పై అసలైన ఇంటిని వెతికాడు.
ఈ ఏజెంట్ పేరు మహ్మద్ ఆజమ్( Mohammad Azam ).
అసలేం జరిగిందంటే, తమల్ సాహా( Tamal saha ) అనే కస్టమర్ ఇటీవల హైదరాబాద్‌కు వెళ్ళాడు.సిటీ గురించి అతనికి పెద్దగా తెలియదు.ఒక హెవీ వర్కింగ్ డే తర్వాత రాత్రి ఆలస్యంగా తన హోటల్‌కు తిరిగి వచ్చిన అతను సమీపంలోని రెస్టారెంట్‌లు అన్నీ క్లోజ్ అయ్యాయని గుర్తించాడు.
కానీ అప్పటికే అతడికి బాగా ఆకలవుతోంది.దాంతో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాడు, ఆ సమయంలో పొరపాటున తన స్టే చేస్తున్న హోటల్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న లొకేషన్‌ను ఎంచుకున్నాడు.

ఆర్డర్ అందుకున్న మహ్మద్ కస్టమర్ సాహాను ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా అతడిని చేరుకోలేకపోయాడు.జీపీఎస్‌ని అనుసరించి కస్టమర్‌ను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు.12 కి.మీ బైక్‌పై వెళ్లి లొకేషన్‌కు చేరుకోగా అది తప్పు అడ్రస్ అని గుర్తించాడు.సాహాకు మళ్లీ కాల్ చేసి, చివరికి అసలైన అడ్రస్ తెలుసుకున్నాడు.
అతను ఎక్కడ ఉంటున్నాడని సాహాను అడిగాడు, సాహా తప్పుగా అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేశానని అప్పుడు గ్రహించాడు.సాహా అజమ్‌కి క్షమాపణలు చెప్పాడు, ఉదయం నుంచి ఏమీ తినలేదని, కానీ లేట్ అయిపోయింది కాబట్టి ఆర్డర్‌ను కాన్సల్ చేసి, ఆహారాన్ని డెలివరీ ఏజెంట్ నే తినమని చెప్పాడు.
కానీ ఆజమ్ అందుకు నిరాకరించాడు.ఒక వ్యక్తిని ఆకలితో అలమటించడం అమానుషమని, ఎలాగైనా ఆహారం అందజేస్తానని చెప్పాడు.అతను తన హోటల్ పేరు, గది నంబర్‌ను షేర్ చేయమని సాహాను కోరాడు.ఆ వివరాలు నోట్ చేసుకున్న తర్వాత మళ్లీ తన బైక్‌పై బయలుదేరాడు.

తెల్లవారుజామున 3 గంటలకు సాహా హోటల్‌కు చేరుకుని ఆహారాన్ని అందజేశాడు.ఆజమ్ చూపించిన కేర్ కు సాహా పొంగిపోయాడు.అతనికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.తన ఆహారాన్ని అతనితో పంచుకోవడానికి ట్రై చేశాడు, కానీ ఆజమ్ నిరాకరించాడు.తన కోసం ప్రార్థించాల్సిందిగా సాహాను కోరుతూ వెళ్లిపోయాడు.ఆజమ్ దయతో సాహా ఎంతగానో కదిలిపోయాడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన కథను పంచుకున్నాడు.
అతను ఆజమ్ డెలివరీ ట్రాకింగ్ ఫొటో పోస్ట్ చేశాడు.అంకితభావాన్ని, మానవత్వాన్ని ప్రశంసించాడు.
ఫోటో తీద్దామంటే డెలివరీ బాయ్ కు కెమెరా ఉంటే కొంచెం సిగ్గు అని, అందుకని తీయలేదని చెప్పాడు.ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆజమ్ చేసిన పనిని చాలామంది ప్రశంసిస్తున్నారు.ఇలాంటి వ్యక్తులకు క్యాష్ రూపంలో ఎంతో కొంత గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరుతున్నారు.







