ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారనే సంగతి తెలిసిందే.ఈ నెలలోనే పుష్ప ది రూల్ షూటింగ్ మొదలు కానుండగా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తైతే అనుకున్న విధంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.
బన్నీ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
స్నేహారెడ్డి సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా బన్నీ భార్య కావడంతో ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.తాజాగా బన్నీ భార్య బ్లాక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లలో కొంతమంది ఫోటోలో అక్క సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.
ఒక నెటిజన్ మాత్రం ఏకంగా స్నేహారెడ్డి పరమసుందరి అంటూ కామెంట్ పెట్టడం గమనార్హం.
అల్లు స్నేహారెడ్డి ఇద్దరు పిల్లల తల్లి అయినా ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.బన్నీతో కలిసి స్నేహారెడ్డి నటిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు.2011 సంవత్సరం మార్చి నెల 6వ తేదీన అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం గ్రాండ్ గా జరిగింది.
పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న జోడీలలో బన్నీ స్నేహారెడ్డి జోడీ ఒకటి కావడం గమనార్హం.పుష్ప ది రూల్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు అల్లు అర్జున్ కోరుకున్న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.