పఠాన్ ఫ్లాప్ అన్న నెటిజెన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన షారుఖ్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటించిన తాజా చిత్రం పఠాన్.సినిమా ఇటీవల జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తూ దూసుకుపోతోంది.

 Netizen Asks Shahrukh Khan Pathan Movie Second Half Disappointing, Pathan,shahru-TeluguStop.com

అంతేకాకుండా భారీగా కలెక్షన్స్ ను రాబడుతూ బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది.భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతూ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

కాగా ఇప్పటికే కేజీయఫ్‌ 2, బాహుబలి వంటి పాన్‌ ఇండియా చిత్రాల రికార్డ్‌ బ్రేక్‌ చేసిన తొలి హిందీ సినిమాగా కూడా నిలిచింది.

అంతే కాకుండా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.ఈ సందర్భంగా తాజాగా శనివారం వీకెండ్ కావడంతో షారూక్ ఖాన్ ఎప్పటిలాగే తన అభిమానులతో ఆస్క్‌ఎస్‌ఆర్ కే సెషన్ నిర్వహించారు.

ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు షారుఖ్.అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు షారుక్ ఖాన్.నేపథ్యంలోనే సరదాగా మాట్లాడుతూ ఇవాళ నాకు జలుబు ఉంది కాబట్టి పెళ్లి ప్రతిపాదనలు తీసుకురావద్దని అభిమానులను సరదాగా కోరాడు.ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.

పఠాన్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని కానీ సెకండాఫ్ తీవ్ర నిరాశపరిచిందని అంటూ కామెంట్ చేసాడు.ఆ విషయంపై షారుఖ్ స్పందిస్తూ.దీనికి చింతించాల్సిన అవసరం లేదు.నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా.అయితే ఈ వీకెండ్‌ ఓటీటీలో సెకండాఫ్ చూసేయండి.అంటూ సలహా ఇచ్చారు.

మరో అభిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున మీతో డేట్‌కు వెళ్లాలనుందని అడిగింది.దీనికి షారూక్ ఖాన్ రిప్లై ఇస్తూ.

డేట్‌ అంటే నాకు చాలా బోరింగ్.ఆ రోజు ఎవరైనా మీ ఫ్రెండ్‌తో కలిసి పఠాన్ సినిమాకు వెళ్ళండి అంటూ సలహా ఇచ్చారు షారుఖ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube