సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ”ఖుషి”.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.
అలాగే హేషం అబ్దుల్ సంగీతం అందించిన ఈ సినిమాను లవ్ స్టోరీల స్పెషలిస్ట్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయడంతో ముందు నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి.

గత రెండు సినిమాలతో అందుకున్న పరాభవాన్ని మరిపించేలా హిట్ అందుకోవాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటించిన ”ఖుషి”( Kushi ) మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది.సెప్టెంబర్ 1న అంటే ఈ రోజు గ్రాండ్ గా అన్ని చోట్ల రిలీజ్ అవ్వడమే కాదు మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంది.
ఎట్టకేలకు విజయ్ ఎన్నో ఏళ్ల తర్వాత మంచి శుభవార్త విన్నాడు.
ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయడమే కాదు రిలీజ్ అయినా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలరించింది.
ముఖ్యంగా ఈ సినిమా పాటలతోనే సగం హిట్ అయ్యింది.ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా థియేటర్స్ లో మౌత్ టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్, సమంత( Samantha ) జంటకు హిట్ దక్కింది.
మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రాగా అప్పుడే ఓటిటి పార్ట్నర్( Kushi Movie OTT ) అయితే లాక్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమా హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix ) వారు సొంతం చేసుకున్నట్టు టాక్.దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
కొన్ని వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.







