నెల్లూరులో జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు.సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్ల అధ్వానంగా తయారయ్యాయంటూ థాంక్యూ సీఎం సార్ అని నినాదంతో నగరంలోని గుంతలు పడ్డ రోడ్ల వద్ద వైసీపీ రంగులతో కూడిన ముగ్గులు వేసి తమ నిరసన చేపట్టారు.
జనసేన రాష్ట్ర నాయకుడు కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగింది.ప్రభుత్వంపై కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏ మూల చూసిన రోడ్లు అద్వానంగా తయారైపోయాయని, పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.బైకులు పై వెళ్తే నడుములు విరిగిపోతున్నాయని మండిపడ్డారు.