వామ్మో.. భర్తకు దగ్గరుండి మాజీ లవర్ తో పెళ్లి చేసిన సతీమణి!

ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందో అమ్మాయి.

అయితే ఆ అబ్బాయి తనకంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసింది.

అయితే మొదటి భార్య అతడితో విడిపోకుండానే రెండో పెళ్లి చేసింది.

అలా అని మొదటి భార్య భర్తకు దూరంగా ఉండదట. ముగ్గురూ కలిసి ఎంచక్కా ఒకే ఇంట్లో ఉండి గుట్టుగా కాపురం చేసుకుంటారట అయితే ఈ విచిత్ర ప్రేమకథ చిత్రమ్ ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెల్లూరు జిల్లా డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కల్యాణ్ కు ఇటీవలే విమల అనే అమ్మాయితో వివాహం జరిగింది.వీరిద్దరికీ టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడగా.

Advertisement

కొంత కాలానికి ప్రేమికులయ్యారు.ఆ తర్వాత బార్యాభర్తలు అయ్యారు.

అంతా బాగుందనుకున్న సమయంలో ఇతగాడి మొదటి లవర్ నిత్య శ్రీ ఎంట్రి ఇచ్చింది.గతంలో కల్యాణ్ తాను ప్రేమించుకున్నామని, అయితే పెద్దకు వల్ల తనకు దూరం అయ్యాయనని వివరించింది.

ఇన్నాళ్లూ అతడే వస్తాడనుకొని పెళ్లి కూడా చేస్కోకుండా వేచి చూశానని మొదటి భార్య వద్ద కన్నీళ్లు పెట్టుకుంది.దీంతో కరిగిపోయిన విమల మీ ప్రేమ నిజమైంది నీకిష్టమైతే ఆయన్ను రెండో పెళ్లి చేస్కో.

ముగ్గురం కలిసే ఉందామని వివరించింది.అందుకు నిత్య శ్రీ ఓకే చెప్పడం, భర్త కల్యాణ్ కూడా సరే అనడంతో వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించింది మొదటి భార్య విమల.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

ఇలా ఈ ముగ్గురూ ఒకటయ్యారు.స్టోరీకి శుభం కార్డు వేశారు.

Advertisement

తాజా వార్తలు