నెల్లూరు జిల్లా వైసీపీ నేతకు కత్తిపోట్లు..!!

గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం అతనిపై చర్యలతో నెల్లూరు రాజకీయాలు హిట్ ఎక్కాయి.

 Nellore District Ycp Leader Sameer Stabbed Nellore, Ysrcp, Kotam Reddy Sridhar R-TeluguStop.com

ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై గత కొద్ది రోజులుగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

బారాషాహీద్ దర్గా దగ్గర రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకీ  దారితీసింది.ఈ ఘర్షణలో వైసీపీ నేత సమీర్ కు కత్తిపోట్లు కావటంతో…వెంటనే సమీర్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

బారాషాహీద్ దర్గా దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube