ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్( Bhola shankar ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయినా వేదలమ్ సినిమా కి రీమేక్ గా వస్తుంది.అజిత్ హీరో గా చేసిన ఈ సినిమా ఆయనకి చాలా మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పాలి అయితే చిరంజీవి ( Chiranjeevi ) ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే చాలా విమర్శలు వస్తున్నాయి వేదలమ్ సినిమాని( Vedalam ) ఇప్పటికే అందరు చూసారు మళ్లీ రీమేక్ ఎందుకు చేస్తున్నారు అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేసారు ఇక దానికి తోడు మెహర్ రమేష్ లాంటి ప్లాప్ డైరెక్టర్ కి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వడం కూడా చాలా విమర్శలకి నిలయంగా మారింది…దానికి తోడు చిరంజీవి ఫస్ట్ లుక్ గా వదిలిన ఒక లుక్ కూడా కాపీ అంటూ చాలా ట్రోల్స్ వచ్చాయి…
ఇక దీనికి తోడు మెహర్ రమేష్ ముందు సినిమాలు అయినా కంత్రి ,బిల్లా,శక్తి,షాడో లాంటి వరుస ప్లాప్ సినిమాలని కలుపుతూ చాలా ట్రోల్స్ చేస్తున్నారు.ఈ సంవత్సరమే సంక్రాంతి కి వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన చిరంజీవి ఈ సినిమా తో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉన్న విషయం అనే చెప్పాలి…
ఈ సినిమా తరువాత చిరంజీవి చేయాల్సిన నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు చిరంజీవి కోసం చాలా రోజులు వెయిట్ చేసిన వెంకీ కుడుముల కూడా నితిన్ తో సినిమా అనౌన్స్ చేసాడు.కాబట్టి చిరంజీవి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయుబోతున్నారు అనే విషయం మీద కూడా ఫిలిం నగర్ లో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి…అయితే భోళా శంకర్ రిజల్ట్ చూసి తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసే ప్లాన్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తుంది…