అతి చేసి జూనియర్ ఎన్టీఆర్ ను పలచన చేయకండి.. తారక్ ఫ్యాన్స్ జాగ్రత్త పడాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను( JR NTR ) కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానిస్తున్నారు.

 Negative Comments About Young Tiger Ntr Details, Ntr, Junior Ntr Fans, Jr Ntr, N-TeluguStop.com

అయితే కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు చిరాకు తెప్పిస్తున్నారు.అప్ డేట్స్, అప్ డేట్స్ అంటూ టార్చర్ చేయడంతో అమిగోస్ మూవీ ఈవెంట్ లో ఫ్యాన్స్ పై తారక్ ఒకింత సీరియస్ అయ్యారనే సంగతి తెలిసిందే.

ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ కు( NTR Ghat ) నివాళులు అర్పించడానికి తారక్ వెళ్లగా అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తారక్ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ కు వస్తాడని తెలిసిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.తారక్ తాతను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నా ఆయన ఫీలింగ్స్ ను ఫ్యాన్స్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

Telugu Cm Ntr, Jr Ntr, Ntr Fans, Nandamuritaraka, Ntr Anniversary, Ntr Ghat, Ntr

ప్రశాంతంగా తారక్ దండం పెట్టుకోలేని పరిస్థితిని కల్పించారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అభిమానుల వల్ల తారక్ కు ఎలాంటి నష్టం లేదు.అయితే తారక్ మనోభావాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు.అతి చేసే అభిమానులు ఈ విషయాలను గుర్తుంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Cm Ntr, Jr Ntr, Ntr Fans, Nandamuritaraka, Ntr Anniversary, Ntr Ghat, Ntr

సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ సమయం, సందర్భం లేకుండా కామెంట్లు చేయడం సరి కాదు.ఈ విషయంలో మారాల్సింది అభిమానులేననే సంగతి తెలిసిందే.అభిమానం అంటే తమ ఫేవరెట్ హీరోను ఇబ్బంది పెట్టకపోవడం అని కూడా అభిమానులు గుర్తుంచుకుంటే మంచిది.ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సినిమా సినిమాకు పారితోషికాన్ని పెంచుకుంటున్న తారక్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు ఓకే చెబుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube