డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీరజ్ చోప్రా.. గాయంతోనే బరిలోకి..!

నీరజ్ చోప్రా( Neeraj Chopra ) అనే పేరుకు పరిచయం అక్కర్లేదు.

భారత ఒలంపిక్ బంగారు పతకాన్ని సాధించిన స్టార్ అథ్లెటిక్స్ ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా డైమండ్ లీగ్( Diamond League ) లో మరోసారి తన సత్త ఏంటో చాటాడు.తాజాగా శుక్రవారం స్విట్జర్లాండ్ ( Switzerland )లోని లాసెన్నే లో జరుగుతున్న డైమండ్ లీగ్ టైటిల్ రెండవ లీగ్ లో అందరికంటే ముందు స్థానంలో నిలిచాడు.

మొదటి లీగ్ తర్వాత గాయపడి టోర్నీలోకి వచ్చిన నీరజ్ అసౌకర్యంగానే టోర్నీ లీగ్ లో పాల్గొని విసిరిన మొదటి త్రో మిస్ అయింది.మొదటి రౌండ్ ముగిసేసరికి మొదటి మూడు స్థానాలలో నిలబడలేకపోయాడు.

జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్( Julian Weber ) 86.20 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు.నీరజ్ చోప్రా రెండవ ప్రయత్నంలో 83.52 మీటర్లతో మూడవ స్థానానికి చేరుకున్నాడు.రెండవ రౌండ్ ముగిసేసరికి వెబెర్ అగ్రస్థానంలోనే కొనసాగాడు.నీరజ్ చోప్రా తన మూడవ ప్రయత్నంలో 85.02 మీటర్లు విసిరి రెండవ స్థానానికి వచ్చాడు.జూలియన్ వెబర్ 86.20 మీటర్లతో మొదటి స్థానంలోనే ఉన్నాడు.ఇక నాలుగవ ప్రయత్నంలో కూడా నీరజ్ త్రో మిస్ అయినా కూడా రెండవ స్థానంలోనే నిలిచాడు.నీరజ్ చోప్రా తన ఐదవ ప్రయత్నంలో అత్యధికంగా 87.66 మీటర్లు విసిరి మొదటి స్థానానికి చేరుకున్నాడు.ఆ తరువాత జూలియన్ వెబర్ రెండవ స్థానానికి పడిపోయాడు.

Advertisement

నీరజ్ చోప్రా తన చివరి ఆరవ ప్రయత్నంలో 84.15 మీటర్లు విసిరాడు.జూలియన్ వెబర్ టైటిల్ కొట్టాలంటే 87.66 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరాలి.కానీ వెబర్ 87.03 మీటర్లు మాత్రమే విసడంతో నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ టైటిల్ గెలిచాడు.టైటిల్ గెలిచిన తర్వాత విజయంపై నీరజ్ చోప్రా స్పందిస్తూ.

గాయం నుంచి కోలుకున్న కూడా కాస్త అసౌకర్యంగానే ఉన్నానని తెలిపాడు.తాను అనుకున్న రీతిలో ఉత్తమ ప్రదర్శన కనబరచలేకపోయానని తెలిపాడు.

అయినా కూడా గెలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.డైమండ్ లీగ్ లో మొదటి స్థానంలో నీరజ్ చోప్రా, రెండవ స్థానంలో జూలియన్ వెబర్ (జర్మనీ), మూడవ స్థానంలో జాకబ్ వాద్లేచ్ (చెక్ రిపబ్లిక్) నిలిచారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు