సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ( Nayanatara ) ఒకరు.ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది.
ఇలా రెండు దశాబ్దాల కాలంగా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ ఉన్నటువంటి నయనతార ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవల షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ ( Jawan ) సినిమాలో నటించారు.ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ప్రేమలో ఉన్నటువంటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం తనని పెళ్లి చేసుకున్నారు ఇలా పెళ్లి అయిన వెంటనే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం వీరిద్దరూ తమ పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇకపోతే ఇటీవల నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తలను ఖండిస్తూ వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలతో విడాకుల వార్తలకు చెక్ పెట్టారు అయితే తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.నయనతార తన రేంజ్ కంటే చాలా తక్కువ రేంజ్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
నయనతార డైరెక్టర్ విగ్నేష్ కంటే ముందుగానే కొరియోగ్రాఫర్ ప్రభుదేవా( Prabhudeva ) హీరో శింబు( Shimbu ) వంటి వారితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు ఏకంగా వారిని పెళ్లి చేసుకోవాలని ఈమె పెళ్ళికి కూడా ఏర్పాట్లు చేసుకొని అనంతరం బ్రేకప్ చెప్పుకున్నారు ఇలా పెద్ద ఎత్తున ప్రేమ వ్యవహారాల ద్వారా వార్తలలో నిలిచినటువంటి ఈమె డైరెక్టర్ విగ్నేష్ ను పెళ్లి చేసుకున్నారు అయితే ఈయనని పెళ్లి చేసుకోవడానికి కారణం లేదని తెలుస్తోంది.ఈయనతో పెళ్లి జరిగిన తర్వాత ప్రభుదేవా నుంచి లేదా సదరు హీరో నుంచి ఈమెకు ఎలాంటి ఇబ్బంది జరిగిన విగ్నేష్ పెద్దగా పట్టించుకోరని పైగా అతను ఎదురు చెప్పే మనస్తత్వం కూడా కాదని గ్రహించినటువంటి నయనతార తనని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారింది.ఇలా తన పెళ్లి విషయంలో కూడా నయనతార ఇంత కన్నింగ్ గా ఆలోచించారా అంటూ ఈమె అభిమానులు షాక్ అవుతున్నారు.