దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా, సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో నయనతార మొదటి స్థానంలో ఉన్నారు.ఇక ఈమె సినిమాల వరకు మాత్రమే కమిట్ అవుతారు కానీ ఆ సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ కూడా పాల్గొనరు.
అయితే తాజాగా కనెక్ట్ అనే సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
ఇక తెలుగులో ఈమె ఆగ్ర హీరోలుగా ఎంతో పేరు సంపాదించుకున్న చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ హీరోలతో కలిసి నటించిన ఈమె ఈ టాలీవుడ్ స్టార్ హీరోలపై తన అభిప్రాయాల గురించి తెలియజేస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.బాలకృష్ణతో కలిసి తాను రెండు సినిమాలలో నటించానని అయితే బాలకృష్ణ గారితో ఇంకో టేక్ కావాలని అడగడం చాలా ఇబ్బందికరంగా భయంగా ఉంటుందని తెలిపారు.అయితే ఆయన మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉంటారని తెలిపారు.ఇక మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కూడా తన స్టార్డం యాటిట్యూడ్ చూపించరని తెలిపారు.నాగార్జున చార్మింగ్ హీరో అని,వెంకటేష్ ను తన కుటుంబ సభ్యులలో ఒకరిగా పోలుస్తూ ఈమె ఈ నలుగురు హీరోల గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.