టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే టాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే కోలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడే పాగా వేసుకొని వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న హీరోయిన్స్ అగ్ర హీరోయిన్ గా రాణిస్తూ అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా కూడా నిలిచింది.ఇది ఇలా ఉంటే నయనతార కోలీవుడ్ స్టార్ట్ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.అయితే పెళ్లి తర్వాత కూడా నయనతార, విగ్నేష్ ఇద్దరు సినిమాలలో బాగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని హనీమూన్ కి చెక్కేశారు.ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లోని బార్సీలోనాలో వెకేషన్ ను చేస్తున్నారు.అక్కడి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లినా కూడా తాళిబొట్టుతో కనిపించిన నయనతార ఈ వెకేషన్ లో కూడా తాళిబొట్టుతోనే కనిపించడం విశేషం.
అయితే చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత తాళిబొట్టును తీసేయగా నయనతార మాత్రము పెళ్లిరోజు విగ్నేష్ కట్టిన తాళిబొట్టును అలాగే ఉంచుకొని ఎక్కడికి వెళ్లినా కూడా అలాగే ఉంచుకుంటోంది.మోడరన్ డ్రెస్సులు వేసుకున్న కూడా తాళిబొట్టును మాత్రం తీయకుండా ఉండడం పట్ల నెటిజెన్స్ ఆమెపై ప్రశంశలు కురిపిస్తున్నారు.







