మెగాస్టార్ సినిమాకి నయనతార రికార్డు స్థాయి రెమ్యునరేషన్?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.ఇది ఇలా ఉండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించడానికి లేడీ సూపర్ స్టార్ నయనతార ఒప్పుకున్నట్లు సమాచారం.

నవంబర్ 18వ తేదీ నయనతార పుట్టినరోజు కావడంతో గాడ్ ఫాదర్ చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటించడానికి నయనతార రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించడానికి నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్ చేశారట.నయనతార ఈ విధంగా అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తనకు 4 కోట్లను చెక్కు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది.

Nayanthara Record Remuneration For Chiranjeevi Movie Details, Nayantara, Tollyw
Advertisement
Nayanthara Record Remuneration For Chiranjeevi Movie Details, Nayantara, Tollyw

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక వంటి హీరోయిన్లు కేవలం రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా కేవలం నయనతార మాత్రమే రికార్డు స్థాయిలో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా చిరంజీవికి చెల్లెలుగా నటించడం విశేషం.ఇదివరకే వీరిద్దరు హీరో హీరోయిన్లుగా సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు