సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయని పావని హ్యాష్ ట్యాగ్.. వాళ్లతో పోలిస్తే బెటర్ అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) నుంచి తాజాగా నయని పావని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

నయని పావని ఎలిమినేషన్ ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో ఆమె కంటే చెత్త కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారని ఆమెను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏముందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ట్విట్టర్ లో నయని పావని హ్యాష్ ట్యాగ్ ( Hashtag of Nayani Pavani )తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

నయని పావని ఎలిమినేషన్ అన్యాయమని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఏ మాత్రం ఇవ్వకుండా ఎలిమినేట్ చేయడం ఏంటని నెటిజన్లు చెబుతున్నారు.నయని పావనికి భారీ స్థాయిలోనే పారితోషికం దక్కినా ఒక రకంగా చెప్పాలంటే ఆమెను అవమానించారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ యాక్టివ్ గా ఉండటంతో పాటు అందరితో కలిసిపోయిన కంటెస్టెంట్ ను ఎందుకు ఎలిమినేట్ చేశారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

శోభాశెట్టికి( Sobha Shetty ) బదులుగా నయని పావనిని ఎలిమినేట్ చేశారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం గురించి సైతం క్లారిటీ రావాల్సి ఉంది.అశ్విని, పూజామూర్తి, భోలే షావళితో పోల్చి చూస్తే నయని పావని 100 రెట్లు బెటర్ అని అయితే బిగ్ బాస్ రాజకీయాలకు ఈ బ్యూటీ బలైందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ తప్పు చేశాడని మరి కొందరు చెబుతున్నారు.

వరుస విమర్శల నేపథ్యంలో బిగ్ బాస్ నయని పావని రీఎంట్రీ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.ఉల్టాపుల్టా అంటే మంచి కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటకు పంపించడమా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ సీజన్7 కూడా ఈ పొరపాట్ల వల్ల ఫ్లాప్ సీజన్ అవుతుందని మరి కొందరు చెబుతున్నారు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు