ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇలా ఇటీవల కాలంలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య అధికంగానే ఉంది.
అయితే విడాకుల దిశగా మరో స్టార్ హీరోయిన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanatara ) లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇక ఈమె గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార పలువురితో ప్రేమ బ్రేకప్ అని పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇకపోతే ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) అనే వ్యక్తి ప్రేమలో పడ్డారు.వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు.
గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి బంధంతో ఒకటైనటువంటి ఈ దంపతులు పెళ్లి అయిన కొన్ని నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు.
ఇలా ఈ నలుగురు ఎప్పుడు సంతోషంగా ఉండడమే కాకుండా వారి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాలను తెలియజేసేవారు.అయితే తాజాగా నయనతార చేసిన పని తెలిసి ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.సోషల్ మీడియా వేదికగా తన భర్తను అన్ ఫాలో ( Unfallow ) చేయడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొంపతీసి నయనతార కూడా విడాకులు( Divorce ) తీసుకుంటున్నారా అందుకే తన భర్తను అన్ ఫాలో చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలా తన భర్తను అన్ ఫాలో చేసినప్పటికీ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను నయనతార అలాగే పెట్టారు.
బహుశా ఇది ఏదైనా సమస్య కారణంగా తన భర్త అన్ ఫాలో అయ్యారా లేకపోతే విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.