పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్గిల్( Nawaz Sharif Kargil ) యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా షరీఫ్ పాకిస్తాన్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధం( Kargil war ) గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.1999లో భారత్.పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి తాను అనుకూలంగా లేనని పాకిస్తాన్ సైన్యం.
భారత్ పై దాడి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.దీంతో తన ప్రభుత్వాన్ని అప్పటి ఆర్మీ జనరల్ ముషరాఫ్ పడగొట్టారని ఆరోపించారు.
కార్గిల్ ప్లాన్ నీ తాను వ్యతిరేకించడంతో.పాటు ఇండియాలోకి చొరబాట్లు… అరికట్టడంతో ముషారాఫ్ కక్షగట్టి ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు స్పష్టం చేశారు.

తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్తాన్ ( Pakistan )లో పర్యటించారని అన్నారు.ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్ పాయ్ లాహోర్ ( Vaz Pai Lahore )కి వచ్చినట్లు తెలియజేశారు.వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారిందని పొరుగు దేశాల కంటే వెనకబడి ఉందని విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ పొరుగు దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు.ఇదే సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కూడా నవాజ్ షరీఫ్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఆయన హయాంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని అనుభవం లేని వ్యక్తికి అధికార పగ్గాలు.ఎందుకిచ్చారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు.దీంతో కార్గిల్ యుద్ధం విషయంలో నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.







