న‌వనీత్ కౌర్ టాలీవుడ్ కు ఎలా పరిచయం అయ్యింది.. ఏ సినిమాల్లో నటించింది .. ?

నవనీత్ కౌర్. తన హాట్ హాట్ అందాలతో తెలుగు తెరమీద హొయలు ఒలికించిన నటీమణి.

వెండి తెరపై తన లేలేత అందాలను పదర్శిస్తూ నటిగా రాణించింది.టాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది.

తన అందంతో పాటు అభినయంతో జనాలను ఆకట్టుకుంది.కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది.

ఈ హాట్ బ్యూటీ న‌వనీత్ కౌర్ తొలుత మళయాళం మూవీ వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుంస‌లో నటించి వెండి తెరకు పరిచయం అయ్యింది.అదే సినిమాను తెలుగులో శ్రీను వాసంతి ల‌క్ష్మీ పేరుతో రీమేక్ చేశారు.

Advertisement

ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.నిజానికి నవనీత్ కౌర్ శత్రువు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఆ సినిమాతో తనకు పెద్దగా పేరు రాలేదు.శ్రీను వాసంతి ల‌క్ష్మీ మూవీతో చక్కటి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి.అందులో చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.

అటు గత ఎన్నికల్లో ఆమె మహారాష్ట్ర నుంచి ఎంపీగా విజయం సాధించారు.అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జయకేతనం ఎగుర వేశారు.లోక్ సభలో సైతం పలు సమస్యలపై గళం ఎత్తుతున్నారు నవనీత్ కౌర్.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఆ హీరో కల్కి సినిమా చేసి ఉంటే 2 వేల కోట్లు వచ్చేవి : నాగ్ అశ్విన్

కొత్త సభ్యురాలు అయినా.తన వాక్చాతుర్యం పట్ల సీనియర్ సభ్యులు అబ్బుర పడుతున్నారు.

Advertisement

తన నియోజకవర్గ సమస్యలతో పాటు జాతీయ సమస్యలపైనా తను స్పందిస్తున్నారు.అయితే ఆమె కులం విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని కోర్టు తేల్చి చెప్పింది.

ఆమె కులం వివాదం తన ఎంపీ పదవికి ముప్పు తెచ్చే అవకాశం ఉంది.నవనీత్ కౌర్ తెలుగు సినిమాల లిస్ట్ ఇదే.

శత్రువు - 2004శీను వాసంతి లక్ష్మి – 2004జగపతి – 2005గుడ్ బోయ్ – 2005రూమ్‌ మేట్స్‌ – 2006స్టైల్ – 2006బంగారు కొండ.పక్కా 420 – 2007మహారథి – 2007జాబిలమ్మ – 2008ఫ్లాష్ న్యూస్ – 2009.

తాజా వార్తలు