ముఖంపై అవాంఛిత రోమాలా.. ఈ ఇంటి చిట్కాతో సహజంగానే తొలగించుకోండి!

సాధారణంగా కొందరికి ముఖంపై అవాంఛిత రోమాలు( Unwanted hair ) చాలా అధికంగా ఉంటాయి.పెదవులపై, గడ్డం దగ్గర, చెంపలపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి.

హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు.ఏదేమైనా ఫేషియల్ హెయిర్ వల్ల మహిళలు ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు.

అసౌకర్యంగా ఫీల్ అవుతారు.ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ రిమూవ్( Facial hair removal ) చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

అయితే షేవింగ్, వ్యాక్స్ వంటి పద్ధతులు కంటే ఇంటి చిట్కాలతో ముఖంపై ఏర్పడిన అవాంఛిత రోమాలను తొలగించుకోవడం ఎంతో ఉత్తమం.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు పాలు పోసుకోవాలి.

అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు( Red lentils ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ) మరియు కొన్ని ఫ్రెష్ ఆరెంజ్ పండు తొక్కలు వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పదార్థాలు పాలతో సహా వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మం పై ఏర్పడిన అవాంఛిత రోమాలు సహజంగానే తొలగిపోతాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అలాగే చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.

Advertisement

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి సైతం తగ్గుతుంది.కాబట్టి ఫేషియల్ హెయిర్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు