Nani Dasara: వామ్మో! నాని దసరా సినిమా కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా?

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని( Nani ) తాజాగా నటించిన చిత్రం దసరా.( Dasara ) ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Natura Star Nanis Whopping Remuneration For Dasara Will Make Your Jaw Drop-TeluguStop.com

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

కాగా విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.దసరా సినిమాతో థియేటర్లలో రచ్చ రచ్చ చేసేందుకు సిద్దమయ్యాడు నాని.కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నడంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను రెండు సంస్థలు భారీ ధరకు దక్కించుకున్నాయి.ఈ మూవీ సినిమా విడుదల అయిన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.

ఈ సినిమాలో కేవలం క్లైమాక్స్ సన్నివేశం కోసం ఐదు కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు గాను నాని ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదే విషయం గురించి జోరుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కాగా హీరో నాని దసరా సినిమా కోసం 20 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్న తెలుస్తోంది.ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాన్ ఇండియా సినిమా అందులో స్టార్ హీరో కాబట్టి ఆ మాత్రం తీసుకోవడంలో తప్పులేదులే అంటున్నారు నెటిజెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube