నాటు నాటు సాక్షిగా ట్విట్టర్ వార్.. తప్పులను ఎత్తి చూపిస్తూ..

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

 Natu Natu War In The Twitter, Natu Natu Song, Rrr, Rajamouli, Ram Charan, Ntr-TeluguStop.com

ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో టీమ్ అంతా ఇన్ని రోజుల టెన్షన్ మరిచి హాయిగా రిలాక్స్ అయ్యారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించాడు.అందరు ఊహించిన విధంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.

ఇక్కడే కాదు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోయేలా వసూళ్లు చేస్తూ అక్కడ కూడా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చూపిస్తుంది.అయితే తాజాగా మేకర్స్ నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.

దీంతో ఈ సాంగ్ కాసేపట్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది.అయితే చాలా మంది హీరోల శ్రమ ను, రాజమౌళి పనితనాన్ని మెంచుకుంటుంటే కొంత మంది మాత్రం తప్పులను వెతికే పనిలో పడ్డారు.

Telugu Natu Natu, Natu Natu War, Rajamouli, Ram Charan-Movie

ఈ పాటలో డ్యాన్స్ ఎవరు బాగా చేసారు.ఎవరు చేయలేదు ఎవరు.అద్భుతంగా నటించారు.అనేది దానిపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తుంది.ఇద్దరి హీరోల మధ డ్యాన్స్ కదలికల మధ్య తేడా లను ఎత్తి చూపిస్తున్నారు.రాజమౌళి అలాంటి వాటిని విస్మరించినందుకు నిందిస్తున్నారు.

ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ మధ్య హ్యాండ్ తిప్పే మూమెంట్ నుండి జంప్ చేసే మూవ్ ల వరకు అన్నిటిని తప్పులు ఉన్నాయంటూ విశ్లేషిస్తున్నారు.అయితే ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ఇద్దరు స్టార్ హీరోలను ఏ చిన్న లోపం లేకుండా చూపించడం కష్టమే అని ఇంకొంత మంది వాదిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube