సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను.. నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Natti Kumar Sensational Comments Goes Viral In Social Media Details Here , AP CM YS Jagan , Natti Kumar, Film Chamber, Exhibitors, Distributors , Ap Sarkar

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండగా కొన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయి.తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి జగన్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

 Natti Kumar Sensational Comments Goes Viral In Social Media Details Here , Ap Cm-TeluguStop.com

సినిమా విడుదలైన రోజునే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా చూసే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నిర్ణయం త్వరలో అమలులోకి రానుండగా ఈ నిర్ణయం గురించి నట్టి కుమార్( Natti Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ లో ప్రదర్శించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమాలను చూసే అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన తెలిపారు.

నిర్మాతల మండలిని, ఫిల్మ్ ఛాంబర్( Film chamber ) ను సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎలా తీసుకుందని నట్టి కుమార్ అన్నారు.గతంలో ఇదే తరహా నిర్ణయాలు పలు డీటీహెచ్ లు అమలు చేయాలని చూసినా వర్కౌట్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు.ఈ విధానం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వ్యవస్థ నాశనమైందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి నిర్మాతలు వ్యతిరేకమని ఆయన తెలిపారు.

సినీ పరిశ్రమకు చెందిన వాళ్ల నిర్ణయాలు తీసుకోకుండా జగన్ సర్కార్ సొంత నిర్ణయాలను అమలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని కొంతమంది చెబుతున్నారు.జగన్ సర్కార్ నుంచి ఈ కామెంట్ల విషయంలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.నట్టి కుమార్ ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Natti Kumar Sensational Comments Goes Viral In Social Media Details Here , AP CM YS Jagan , Natti Kumar, Film Chamber, Exhibitors, Distributors , Ap Sarkar - Telugu Ap Cm Ys Jagan, Ap Sarkar, Distributors, Exhibitors, Chamber, Natti Kumar #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube