అమెరికాలో NATS వాలీబాల్ టోర్నమెంట్...

తెలుగు రాష్ట్రాల నుంచీ అమెరికా వెళ్లి స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు అక్కడ పలు తెలుగు సంఘాలను ఏర్పాటు చేసుకుని తెలుగు వారి అభివృద్దే లక్ష్యంగా, తెలుగు వారి అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేస్తుంటారు.

ఎన్నో సేవా, విద్య , వైద్య కార్యక్రమాలని నిర్వహించే తెలుగు సంస్థలు ప్రధానంగా తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేస్తుంటారు.

ఈ బాటలోనే ప్రతీ తెలుగు సంఘం ఎంతగానో కృషి చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు ఎన్నారైలు ఏర్పాటు చేసుకున్న నార్త్ అమెరికా తెలుగు సంఘం అక్కడే స్థిరపడిన తెలుగు వారి పిల్లల కోసం బాలల సంబరాలు ఏర్పాటు చేసింది.

సుమారు 7 నుంచీ 18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఇందులో భాగంగా చెస్ ఛాంపియన్ షిప్, ఫ్యాన్సీ డ్రెస్, సింగింగ్, డ్యాన్సింగ్, వాలీబాల్, త్రో బాల్, వంటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించే పోటీలను 18 వ తేదీన నిర్వహించనుంది.

ఉదయం 9 గంటలకు మొదలవనున్న ఈ పోటీలు సాయంత్రం 6 గంటల వరకూ జరగనున్నాయి.ఈ పోటీలలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్ లో https://www.natsworld.org/balala-regform?eid=20321&cname=nats-global&cid=2 రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.పోటీలలో పాల్గొనే వారికి ఫీజులు కూడా నిర్ణయించారు.చెస్ ఆడే వారికి నాట్స్ సభ్యులు అయితే 15 డాలర్లు కాగా ఇతర తెలుగు వారికి 20 డాలర్లు గా నిర్ణయించారు అలాగే ఇతరత్రా ఏ పోటీలలో పాల్గోనాలన్నా సరే నాట్స్ సభ్యులు 10 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఇంతర తెలుగు వారు 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

పోటీలు జరుగు ప్రదేశం.చిషోలం 300, గ్రాండ్ సెంటర్ ప్లానో, TX – 75075 మరిన్ని వివరాల కోసం సంస్థ విడుదల చేసిన పోస్టర్ ను పరిశీలించగలరు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు