జనవరి నాలుగో వారం నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.ఇన్ కోవ్యాక్స్ పేరుతో భారత్ బయోటిక్ నాసల్ వ్యాక్సిన్ ను తయారు చేసింది.
రెండు రోజుల క్రితమే భారత్ బయోటిక్ నాసల్ టీకాను కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసుగా ఆమోదించిన సంగతి తెలిసిందే.దీన్ని కోవిన్ యాప్ లోచేర్చారు.
వ్యాక్సిన్ ధర ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.800, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.325 కు అందుబాటులోకి రానుంది.దీనికి అదనంగా ఐదు శాతం జీఎస్టీ ఛార్జీ, వ్యాక్సిన్ ఇచ్చినందుకు చార్జీ వసూలు చేయనున్నారని తెలుస్తోంది.
నాసల్ టీకాను బీబీవీ 154గా పిలుస్తున్నారు.18 ఏళ్లు నిండిన వారు దీన్ని హెటోరోలోగస్ బూస్టర్ డోసుగా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.కోవిన్ యాప్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో స్టాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.