ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సీనియర్ నరేష్( Sr Naresh ) నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.
మళ్లీ పెళ్లి సినిమాతో( Malli Pelli Movie ) హీరోగా మరోసారి నరేష్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మళ్లీ పెళ్లి సినిమాకు బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు.అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సీనియర్ నరేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీల్ లైఫ్ గురించి మాట్లాడే సమయంలో రియల్ లైఫ్ గురించి మాట్లాడాలని ఆయన అన్నారు.నాకు తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే పండంటి కాపురం సినిమాలో అవకాశం దక్కిందని నరేష్ చెప్పుకొచ్చారు.
ఆ సినిమాలో జయసుధ కూడా నటించారని నరేష్ అన్నారు.మా ఇద్దరి ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు అని ఆయన కామెంట్లు చేశారు.
19 సంవత్సరాల వయస్సులో ఎవరికో మంచి చెయ్యడానికి అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని కోరిందని నరేష్ తెలిపారు.కానీ ఆ పెళ్లి ఎవరికీ లాభం చేయలేదని నరేష్ అన్నారు.అమ్మ మళ్లీ నా జీవితంలో మంచి చేయాలని అనుకుంటే ఆ కోరిక కలగా మిగిలిపోయిందని నరేష్ చెప్పుకొచ్చారు.
అమ్మ నాకు మంచి చేయాలని అనుకున్నా చెడే ఎక్కువగా జరిగిందని నరేష్ కామెంట్లు చేశారు.
నేను అన్నీ ఇచ్చాను రాజును చేశాను కానీ మంచి జీవితం ఇవ్వలేకపోయానని అమ్మ ఎప్పుడూ చెప్పేదని నరేష్ అన్నారు.అమ్మ తర్వాత మరో అమ్మ పవిత్ర ( Pavitra Lokesh ) అని గర్వంగా చెబుతానని సీనియర్ నరేష్ కామెంట్లు చేశారు.రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాలేదని నరేష్ తెలిపారు.
పవిత్రతో పరిచయం వల్ల నా జీవితంలో మరో గమ్యాన్ని చేరుకున్నానని అనిపిస్తోందని నరేష్ చెప్పుకొచ్చారు.నరేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy