Raghuram Krishnam Raju : నరసాపురం : ఇంతకి ఎవరీ ఉమా బాల ? “రాజు” గారికి చెక్ పెట్టగలరా ?

వైసిపి ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ అధినేత , ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి అంత పట్టడం లేదు.ఊహించిన విధంగా కొత్త పేర్లను తెరపైకి తెస్తూ నియోజకవర్గ ఇన్చార్జీలుగా నియమిస్తున్నారు.

 Narasapuram Who Is Uma Bala Can Put A Check On The Ragurama Krishnam Raju-TeluguStop.com

తాజాగా ప్రకటించిన ఆరో జాబితాలో ఊహించిన పేర్లే బయటకు వచ్చాయి.ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం కు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమా బాల పేరుని ప్రకటించారు .దీంతో ఎవరి ఉమాబాల ? అనే ఆసక్తి  అందరిలోనూ మొదలైంది.వాస్తవంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నియోజకవర్గంలో నుంచి ఎప్పుడూ క్షత్రియులదే డామినేషన్.

ఇక్కడ నుంచి అన్ని పార్టీల నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేస్తూ ఉండడం ఆనవాయితీ గా వస్తోంది.  ఇదే విధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజు( Raghuram Krishnam Raju ) పోటీ చేసి గెలుపొందారు .ఆ తర్వాత ఆయన వైసిపికి ఆయన దూరం కావడం.

Telugu Guduri Umabala, Janasena, Telugudesam, Ysrcp-Politics

జగన్( YS Jagan Mohan Reddy ) ను ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ, ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు .ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టే విధంగా నరసాపురం పార్లమెంట్ సీటు క్షత్రియ సామాజిక చెందిన జీవీకే రంగరాజు కు ఇచ్చి రఘురామ కు చెక్ పెట్టాలని జగన్ భావించారు .రంగరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు.ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆయన ఉన్నారు.దీంతో రంగరాజు కే ఈ సీటు ను ఖరారు చేయాలని జగన్ భావించినా,  ఆయన పోటీకి నిరాకరించడంతో ఎవరు ఊహించని విధంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గూడూరు ఉమాబాల( Guduri umabala )ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.

Telugu Guduri Umabala, Janasena, Telugudesam, Ysrcp-Politics

 ఈమె నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని భీమవరం పట్టణానికి చెందినవారు .ఈ కుటుంబానికి గతం నుంచీ రాజకీయ నేపథ్యం ఉంది.  ప్రస్తుతం ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.అయితే రాజుల కోటగా పేరుపొందిన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం సమయంలో ఎంపీ అభ్యర్థిగా గుబ్బల తమ్మయ్య పోటీ చేసి ఓటమి చెందారు.

ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ఉమా బాలను జగన్ అభ్యర్థిగా నియమించడంతో ఆమెకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేదానిపై వైసీపీ క్యాడర్ లోనే అనేక సందేహాలు ఉన్నాయి .  జగన్ పాటిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ సొంత పార్టీ నేతలకు సైతం అంతు పట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube