ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫస్ట్ రోజే ఎమ్మెల్సీగా ఫెయిల్ అయ్యాడు.గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన లోకేష్ ప్రసంగాన్ని చూసిన టీడీపీ నేతలకు నవ్వు ఆగలేదు.
పక్కనున్న వారు అయితే షాక్ అయిపోయారు.లోకేష్ ఎమ్మెల్సీగా ఫస్ట్ రోజే ఫెయిల్ అయ్యారన్న గుసగుసలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే టైంలో లోకేష్ ఆ ప్రసంగాన్ని కూడా చదవలేక నానా తంటాలు పడ్డాడు.సార్వభౌమాధికారం అని చదవటానికి ఆయన నానా తంటాలు పడ్డారు.
అది చూసిన వారు కూడా అవాక్కయ్యారు.అంతే కాదు సుమా…ఒక్క సార్వభౌమాధికారమే కాదు…స్వతంత్రతను అనటానికి కూడా ఆయన పడ్డ కష్టం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
లోకేష్ కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.అందులోను సీఎం కుమారుడు…మరి ప్రమాణ స్వీకారం చేసే ముందు అందులో ఏం ఉంటుంది అన్నది ఓ సారి చూసుకోవాలి కదా.? అలా కాకుండా డైరెక్టుగా ప్రమాణ స్వీకారానికి వచ్చేసి అందులో ఉన్న పదాలు చూసి కూడా చదవలేకపోయాడు.దీంతో టీడీపీ వర్గాల్లోనే లోకేష్ ఫస్ట్ డే ఫెయిల్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
తలపండిన రాజకీయవేత్త అయిన చంద్రబాబు ఆయన తనయుడికి ఇచ్చిన ట్రైనింగ్ ఎలాంటిదో ఫస్ట్ రోజే తెలిసిపోయింది.ఇక రాబోయే రోజుల్లో మంత్రిగా లోకేష్ మరెన్ని చిత్రవిచిత్రాలు చేస్తాడో అని అటు టీడీపీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.ఇక ఇటు లోకేష్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంపై సోషల్ మీడియాలో ఒక్కటే సెటైర్లు పడిపోతున్నాయి.
.






