లోకేష్ షాకింగ్ స్టేట్మెంట్... కాస్కో నా వాస్కోడి గామా

రాజకీయాలలోకి ఒకసారి అడుగు పెట్టిన తరువాత ఎంతటి అమాయకుడైనా.ఎంతటి అసమర్దుడైనా సరే అంచెలంచెలుగా రాటుదేలుతారు.

 Nara Lokesh Shocking Statement-TeluguStop.com

లోకేష్ విషయంలో కూడా అదే జరిగింది.లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఎంతటి తడబాటు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.వైసీపి వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారో అంటున్నారో కూడా అందరికి తెలుసు అయితే తనపై పడిన ముద్రని తొలిగించుకునే క్రమంలో లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు…ప్రత్యర్ధుల విమర్సలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు లోకేష్

ఇంతకీ లోకేష్ తీసుకున్న నిర్ణయం ఏమిటి.? లోకేష్ ఎలాంటి ప్రకటన చేశారంటే.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ స్వయంగా పోటీ చేస్తానని తెలిపారట…లోకేష్ రాజకీయాల్లో వచ్చిన నాటినుంచీ ఇప్పటి వరకూ కూడా ప్రతిపక్షాలు చేసే ఏకైక విమర్శ ఒక్కటే.అడ్డదారిలో ప్రజాప్రతినిధిగా లోకేష్ ను సీన్ లోకి తెచ్చారని.

మంత్రిగా చేశారని నిత్యం చేస్తున్న విమర్శలు.అయితే ఈ వార్తలనియా పూర్తీ స్థాయిలో తెలుగుదేశం నేతలు కూడా ఖండించలేని పరిస్థితి.

ఇదిలాఉంటే లోకేష్ ఇప్పటి వరకూ రాబోయే ఎన్నికల విషయంలో తానూ పోటీ చేసే విషయంలో ఒక్క సారికూడా మీడియా సాక్షిగా ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా లోకేష్ ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చారు…రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేస్తానని వెల్లడించారు.

అధిష్టానం ఎక్కడ నుంచి పోటి చేయమంటే.అక్కడి నుంచి పోటీకి తాను సిద్ధమని లోకేష్ కీలక ప్రకటన చేశారు.దీంతో లోకేష్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.అయితే లోకేష్ ఎక్కడి నుంచీ పోటీ చేస్తారు అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

లోకేష్ కూడా ఈ విషయంపై మౌనంగానే ఉన్నారు.ఈ క్రమంలోనే లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే కఠినంగా ఉంటామని ఆయన తెలిపారు.

అయితే తాజాగా నిరుద్యోగ బృతిపై ప్రభుత్వం చేసిన ప్రకటనపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని అన్నారు…కడప స్టీల్ ప్లాంట్ విషయంలో.టీడీపీది నిస్వార్ధ పోరాటమని తెలిపారు…కేంద్రం ఇచ్చే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని వేలకోట్లు రాయితీలు రాష్టం భరిస్తుంటే కేంద్రం ఎందుకని అన్నారు లోకేష్.

ఏదేమైనా సరే లోకేష్ తానూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని ప్రకటన మొదటి సారిగా చేయడం ప్రతిపక్ష పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube