టీడీపీ కార్యకర్త హత్య పై స్పందించిన నారా లోకేశ్.. వైసీపీ పై కీలక వ్యాఖ్యలు.. ?

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హీట్ మీదనే సాగుతాయి.

ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ల మధ్య ఏదో ఒక అంశం పై రచ్చ అవుతుందన్న విషయం ఎన్నో సార్లు నిరూపించబడింది.

ఇప్పటికి అధికార దాహంతో టీడీపీ ఉందని వైసీపీ నేతలు విమర్శించడం, ప్రజలను సరిగ్గా పాలించడంలో వైసీపీ విఫలం అయ్యిందని టీడీపీ నిందించడం కొత్తేమి కాదు.ఇకపోతే ఇక్కడ నేతల మధ్య మాటల యుద్దాలుంటే, వీరి అనుచరులు మాత్రం చంపుకునే దాక వెళ్లడం చిత్రంగా అనిపిస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాలపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త గోపాల్ హత్య విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

Nara Lokesh Responds To Murder Of Tdp Activist, Tdp, Nara Lokesh, Responds, Murd

గోపాల్ ను వైసీపీ నేతలే పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు.కాగా ఈ హత్య జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనం పై లోకేశ్ ఇలా స్పందించడం వైసీపీ నేతలకు చిత్రంగా అనిపిస్తుందట.ఏ హత్య జరిగినా అది వైసీపీ చేసిందని నిందలు వేస్తూ ఇలా ప్రభుత్వాన్ని కించపరచడం పచ్చ పార్టీకి అలవాటుగా మారిందని అధికార నేతలు అనుకుంటున్నారట.

Advertisement
Nara Lokesh Responds To Murder Of Tdp Activist, TDP, Nara Lokesh, Responds, Murd
అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

తాజా వార్తలు