వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్( Nara Lokesh ) యువగళం ( yuvagalam )పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని టీడీపీ ( TDp )శ్రేణులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.
ఇప్పటికే చిత్తూరు, అనంతపురం, పూర్తి చేసుకున్నా పాదయాత్ర ప్రస్తుతం కర్నూల్ లో కొనసాగుతోంది.అయితే ఈ పాదయాత్రలో భాగంగా లోకేశ్ జగన్ సర్కార్ పై, వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలు గుప్పిస్తూనే పలు రకాల హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు నారా లోకేశ్.

ఈ నేపథ్యంలో కర్నూల్ కేంద్రంగా లోకేశ్ ఇచ్చిన హామీ వైఎస్ జగన్ ( YS Jagan )కు ప్లెస్ అవుతుందనే వాదన పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.తాము అధికారంలోకి వస్తే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ ప్రకటించారు.అయితే గతంలోనే కర్నూల్ ను న్యాయ రాజధానిగా వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆయన ప్రతిపాధించిన మూడు రాజధానుల్లో కర్నూల్ ను న్యాయ రాజధానిగా చేస్తామని ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామని జగన్ అండ్ కో పదే పదే చెబుతూ వస్తోంది.అయితే మూడు రాజధానుల విషయంలో ఎన్నో అడ్డంకులు చుట్టుముట్టడంతో జగన్ సర్కార్ వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి.

అయితే ఎన్నికల నాటికి కచ్చితంగా మూడు రాజధానులను అమలు చేసి కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతోంది జగన్ సర్కార్( Jagan Sarkar ).అయితే ఇప్పుడు ఇదే హామీ ప్రతిబింబించేలా లోకేశ్ కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాట్ టాపిక్ అయింది.ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేశ్ హామీ ఇచ్చినట్లుగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఆ క్రెడిట్ జగన్ కే వెళుతుందనేది కొందరి వాదన.ఎందుకంటే ఈ ప్రతిపాదన మొదట తీసుకొచ్చింది జగనే కనుక ఆ క్రెడిట్ మొత్తం ఆయనే వెళ్ళే ఛాన్స్ ఉంది.
మరి లోకేశ్ ఈ హామీని స్వతహాగా ఇచ్చారా ? పార్టీ పరంగానే వ్యాఖ్యానించారా ? అనే తెలియనప్పటికి ప్రస్తుతం ఈ హామీ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.