లోకేష్ సూచించిన వారికే మంత్రి పదవులు ?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.తన కొత్త మంత్రి వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఈ మంత్రి వర్గంలో చాలామంది యువ నాయకులకే అవకాశం దక్కింది.సీనియర్ నాయకులకు అవకాశం దక్కలేదు .మొదటి నుంచి టిడిపిలో కీలకంగా ఉంటూ.చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం సర్వత్ర చర్చనీయాంశం గా మారింది .కొత్త మంత్రివర్గంలో యువ నాయకులకు ఎక్కువ అవకాశం ఇవ్వడం వెనుక చాలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అర్థం అవుతుంది.

Nara Lokesh Behind Tdp Minister Seats Allocation Details, Tdp, Janasena, Ysrcp,

ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు,  అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత,  ఇలా చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు.అయితే ఇదంతా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కారణంగా నే అనే ప్రచారం జరుగుతోంది.చంద్రబాబు ముందు చూపు తో లోకేష్ సూచించిన వారికి మంత్రి పదవులు( Minister Seats ) కట్టబెట్టారు.

గత టిడిపి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్ళలో కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చారు.ముందు ముందు లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లోకేష్ సూచించిన యువ నాయకులకు( Young Leaders ) ఎక్కువగా కొత్త మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్లుగా అర్థం అవుతుంది.

Nara Lokesh Behind Tdp Minister Seats Allocation Details, Tdp, Janasena, Ysrcp,
Advertisement
Nara Lokesh Behind Tdp Minister Seats Allocation Details, TDP, Janasena, Ysrcp,

టిడిపి( TDP ) కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలబడిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త మంత్రివర్గం ను ఎంపిక చేశారట.రాబోయే రోజుల్లో లోకేష్ కు పార్టీలోను , ప్రభుత్వం లోను తిరుగులేకుండా చేసేందుకు , లోకేష్ కీలకంగా మారేందుకు యువ నాయకులకు ఎక్కువగా అవకాశం కల్పించారు.  ఇక కొత్త క్యాబినెట్ కూర్పు వెనుక లోకేష్  మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఈ మంత్రి వర్గంలో తమకు అవకాశం కల్పించకపోవడంపై సీనియర్ నాయకుడు చాలామంది అసంతృప్తితో అన్నారు.అయినా ఈ అసంతృప్తులను పట్టించుకునే పరిస్థితుల్లో అటు చంద్రబాబు గాని , ఇటు లోకేష్ గాని లేనట్టుగానే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు