టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు అయింది.ఈ నెల 5 నుంచి బస్సు యాత్ర చేయాలని నారా భువనేశ్వరి భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.రాయలసీమ జిల్లాల్లో 10 రోజుల బస్సు యాత్రకు టీడీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఇవాళ టీడీపీ శ్రేణులు ఒక్క రోజు నిరాహర దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.