టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి( Nannapaneni rajakumari ) చంద్రబాబు అరెస్టు పట్ల మాట్లాడుతూ మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు.రాష్ట్రంలో లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ ఓర్వలేక వైసీపీ( YCP ) ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినట్లు విమర్శలు చేశారు.
చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించారు.ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదని అన్నారు.
ఒక ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి.కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు.ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి గాని ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు.
“యువగళం”( yuvagalam ) బ్రహ్మాండంగా జరుగుతుండడంతో.చంద్రబాబుపై ఈ రీతిగా చర్య తీసుకున్నారని విమర్శించారు.పాదయాత్రని ఎవరు ఆపలేరు, మళ్లీ ప్రారంభమవుతుంది.చంద్రబాబు పర్యటనలు మళ్ళీ జరుగుతాయి.అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి( Bhuvaneshwari ) గురించి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఇవాళ భువనేశ్వరి గారిని చూస్తే చాలా బాధనిపించింది.
ఆమె ధైర్యంగా ఉండాలి.త్వరలోనే చంద్రబాబు మళ్ళీ నవ్వుతూ అందరి మధ్య వస్తారని.
స్పష్టం చేశారు.