దసరా హిట్‌ తో అప్పుడే నాని నిర్ణయంలో మార్పు.. ఫ్యాన్స్ హ్యాపీ

Nani Dasara Movie After Movie New Interesting Update , Nani Dasara Movie , Dasara, Mrunal Thakur,Nani

నేచురల్ స్టార్‌ నాని( Nani ) హీరోగా నటించిన దసరా సినిమా( dasara ) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నాని మొదటి నుండి చెబుతున్నట్లుగా భారీ విజయాన్ని దసరా చిత్రం దక్కించుకుంది.

 Nani Dasara Movie After Movie New Interesting Update , Nani Dasara Movie , Dasar-TeluguStop.com

మొదటి రోజు వసూళ్లు భారీ ఎత్తున నమోదు అయ్యాయి.అన్ని అనుకున్నట్లుగా సాఫీగా సాగుతూ ఉండటంతో నాని తదుపరి సినిమాను వచ్చే ఏడాదిలో కాకుండా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

దసరా సినిమా సక్సెస్ సెంటిమెంట్‌ ను వినియోగించుకుని వెంటనే ఇదే ఏడాదిలో తదుపరి సినిమాను తీసుకు రావడం వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం కలుగుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు కూడా భావిస్తున్నారట.దసరా సినిమా షూటింగ్ పూర్తి అవ్వక ముందే నాని తన తదుపరి సినిమాను ప్రకటించాడు.

మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.

రెగ్యులర్‌ షూటింగ్ దసరా ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా వాయిదా వేయడం జరిగింది.ఎట్టకేలకు మళ్లీ ఆ సినిమా షూటింగ్‌ కు నాని రెడీ అవుతున్నాడు.వచ్చే వారంలో ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ లో ఉంటుందని తెలుస్తోంది.మృణాల్ ఠాకూర్ కూడా ఆ షెడ్యూల్‌ లో పాల్గొనబోతున్నారట.మొత్తానికి నాని ఆ సినిమాను చాలా స్పీడ్ గా పూర్తి చేసి దసరా తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు.నాని ఒక బిడ్డకు తండ్రి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయట.

అన్ని వర్గాల వారు మెచ్చే పాత్రలో నాని కనిపించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.దసరా సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మృణాల్‌ గత చిత్రం సీతారామం కూడా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.అందుకే నాని మరియు మృణాల్ ఠాకూర్ నుండి రాబోతున్న సినిమా కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Nani Dasara Movie After Movie New Interesting Update , Nani Dasara Movie , Dasara, Mrunal Thakur,Nani - Telugu Dasara, Mrunal Thakur, Nani, Nani Dasara #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube