నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసర.తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పెరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుంది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 2023 మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.అయితే ఈ సినిమాతో తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ, కన్నడతో పాటుగా హిందీ భాషలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప తరహాలో మాస్ మూవీగా రాబోతున్న దసరా సినిమా ని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య ప్రతి తెలుగు సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతుంది.
అయితే లేటెస్ట్ గా రిలీజైన లైగర్ కూడా బాలీవుడ్ లో బీభత్సమైన ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు.అయితే లైగర్ రిజల్ట్ చూసి కూడా నాని దసరా సినిమాని హిందీలో రిలీజ్ చేయాలని చూస్తున్నరు.
కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే హిందీ ఆడియెన్స్ ఓటేస్తారు.ఏది పడితే అది పాన్ ఇండియా రిలీజ్ చేసి తెలుగు సినిమాలపై క్రేజ్ తగ్గేలా చేస్తున్నారు.
మరి నాని దసరా సినిమా హిందీ రిలీజ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.







