సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని( Nani )ఒకరు.నాని హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
చివరిగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాని త్వరలోనే హాయ్ నాన్న ( Hai Naana ) సినిమా ద్వారా బిజీగా ఉన్నారు.నాని మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి నాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ ( Suma ) నానికి ఒక చిన్న టెస్ట్ పెట్టారు.హీరోల కొడుకుల చిన్నప్పటి ఫోటోలను సుమ నానికి చూపించగా వాళ్ళు ఎవరి కొడుకు అనేది గుర్తుపట్టాలి.ఇలా కొందరి ఫోటోలను సుమా చూపించడంతో నాని వారి ఫోటోలను గుర్తుపట్టారు.
వెంకటేష్ కుమారుడు, రవితేజ కుమారుడు, అల్లు అర్జున్ కూతురు, రానా చిన్నప్పటి ఫోటోలన్నింటినీ కూడా సుమా చూపించగా నాని చాలా సులభంగా సమాధానం చెప్పారు./br>

క్రమంలోనే ఎన్టీఆర్ ( NTR ) పెద్ద కుమారుడు చిన్నప్పటి ఫోటోని కూడా సుమా చూపించగా నాని వెంటనే ఎన్టీఆర్ పెద్ద కొడుకు అంటూ సమాధానం చెప్పారు.పెద్ద కుమారుడు ఏమోగానీ చిన్నోడు పెద్ద కంచు అంటూ ఎన్టీఆర్ కొడుకు గురించి నాని చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ కూడా పలు సందర్భాలలో తన చిన్న కుమారుడు చేసే అల్లరి తెలియజేశారు.
ఇలా అభయ్ ( Abhay ) తో పోలిస్తే భార్గవ్ ( Bhargav ) యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి కూడా బాగా చేస్తారనే ఉద్దేశంతోనే నాని ఎన్టీఆర్ కొడుకును పెద్ద కంచు అంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







