'దసరా' టికెట్ల రేట్ల విషయంలో ఆ తప్పు జరగకుండా ఉంటే బెటర్ అంటున్న ఫ్యాన్స్‌

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌ గా రూపొందిన దసరా( Dasara ) సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నాని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దసరా సినిమా విడుదల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు.

నిన్న మొన్నటి వరకు టికెట్ల రేట్ల విషయంలో కాస్త గందరగోళం ఉండేది.కానీ ఇప్పుడు అది కూడా లేదు.

టికెట్ల రేట్లను పెంచుకునే వీలు ఉన్నా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు భారీగా టికెట్ల రేట్లను పెంచకుండా నామమాత్రపు టికెట్ల రేట్లను పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.గతంలో టికెట్ల రేట్లను పెంచడం వల్ల సినిమా లు నష్టపోయాయి.

కనుక దసరా సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో టికెట్ల రేట్ల పై స్పష్టం చేయడం జరిగింది.అంతే కాకుండా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌ కూడా మొదలు అయ్యింది.

Advertisement

అతి త్వరలోనే సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది.నాని మరియు కీర్తి సురేష్ చాలా విభిన్నమైన పాత్రలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

శ్రీకాంత్‌ ఓదెల( Srikanth Odhela ) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ సమయం నుండే అంచనాలు భారీగా మోస్తూ వచ్చింది.ఇప్పుడు సినిమా ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్న కారణంగా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం దసరా సినిమా యూనిట్‌ సభ్యులు పాన్ ఇండియా స్థాయిలో సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ ( keerthy suresh )యొక్క క్రేజ్ కారనంగా తమిళనాట ఈ సినిమా ను కాస్త ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.టికెట్ల రేట్ల పెంపు లేకపోవడంతో నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాను ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు