మాటిచ్చిన నాని పై కసి పెంచుకున్న అవసరాల!

తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్‌ ఆమద్య ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడిగా మారాడు.మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని దక్కించుకున్న అవసరాల ఆ తర్వాత వరుసగా దర్శకుడిగా చిత్రాలు చేయకుండా ఆచి తూచి కథల ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.

 Nani And Avasarala Srinivas Project Shelved-TeluguStop.com

అవసరాల దర్శకుడిగా రెండవ సినిమా జ్యో అచ్యుతానంద చిత్రం కూడా మంచి టాక్‌ను దక్కించుకుంది.ఇప్పుడు అవసరాల మూడవ సినిమాకు సిద్దం అవుతున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం అవసరాల మూడవ సినిమా నాని హీరోగా చేయాల్సి ఉంది.

నాని వరుసగా పెద్ద దర్శకుతో సినిమాలు చేయడంతో పాటు, ఆమద్య అవసరాల చెప్పిన కథ నానికి నచ్చక పోవడంతో మార్పులు చేర్పులకు సూచించాడు.

నాని ఎలాగైనా ఒప్పుకుంటాడు, సినిమా చేస్తాడు అనే నమ్మకంతో అవసరాల వెయిట్‌ చేసి చేసి, స్క్రిప్ట్‌లో నాని చెప్పిన మార్పులు చేసి మరోసారి నానితో సంప్రదింపులు జరిపాడు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, కమిట్‌ అయిన సినిమాలు పూర్తి అవ్వాలంటే 2019 మొత్తం పడుతుందని, అందుకే 2020 వరకు వెయిట్‌ చేయమని అడిగాడట.

దాంతో అవసరాలకు తీవ్ర అసహనం కలిగిందని, ఆ కోపంతోనే అదే స్క్రిప్ట్‌ను కొత్త వారితో చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

అవసరాల శ్రీనివాస్‌ నటుడిగా మరియు దర్శకుడిగా ఒక కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.అంతా కొత్త వారితో ఆ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.కొత్త నటీనటుల కోసం ఒక ప్రముఖ యాక్టింగ్‌ స్కూల్‌కు ఆడిషన్స్‌కు అవసరాల ఈమద్య వెళ్లినట్లుగా తెలుస్తోంది.

నాని నో చెప్పడంతో ఆ కోపంతో ఈ చిత్రాన్ని కసితో తెరకెక్కించబోతున్నాడు.నాని ఈ స్క్రిప్ట్‌ను వదులుకున్నందుకు కుళ్లుకునేలా సినిమాను చేయాలనే పట్టుదలతో దర్శకుడు అవసరాల ఉన్నాడు.

అతి త్వరలోనే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించి సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు.ఈ ఏడాది చివర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

నానిపై ఈమద్య తెగ విమర్శలు వస్తున్నాయి.సౌమ్యుడు, స్నేహశీలి అంటూ పేరున్న నాని ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం కాస్త బాధాకరం.

సినిమా పరిశ్రమలో ఇలాంటి విమర్శలు కొన్ని సార్లు కామనే, కాని నానికి మొదటి సారి అవ్వడంతో అభిమానులు కాస్త కంగారుగా ఉన్నారు.ఇక నాని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పాటు, బిగ్‌బాస్‌ కూడా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube