మోక్షజ్ఞ మూవీ లాంఛ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తారా.. ఆ వివాదానికి చెక్ పెడతారా?

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ పై కన్ఫామ్ కాలేదు.కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయని తెలుస్తోంది.

మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఆయన డెబ్యూ మూవీ లాంచ్ జరగనుందట.

మోక్షజ్ఞ మొదటి చిత్రానికీ ప్రశాంత్ వర్మ ( Prashant Verma )దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ( Tejaswini)సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మైథలాజికల్ టచ్ తో రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తారట.

అధికారిక ప్రకటన కూడా రాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ మూవీ లాంచ్ సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరగనుందని తెలుస్తోంది.

అయితే మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఒక వార్త మరింత ఆసక్తికరంగా మారింది.అదేమిటంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ కీ ఎన్టీఆర్ ( JR ntr )కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరు కాబోతున్నారట.

గొప్ప మనస్సు చాటుకున్న అక్కినేని ఫ్యామిలీ.. అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకున్నారుగా!
ఈ సినిమాల్లో నాని చనిపోతాడు.. అయినా అవి సూపర్ హిట్ అయ్యాయి..?

అంతేకాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ మొదలుకొని ఈ తరం స్టార్స్ వరకు ఎందరో ఈ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసే అవకాశముంది అంటున్నారు.అయితే ఎంతమంది ఉన్నా ఎన్టీఆర్ హాజరైతే ఆయనే ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది.

Advertisement

ఎందుకంటే కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లో ఎన్టీఆర్ మిస్ అవుతున్నాడు.ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ లాంచ్ తో ఆ లోటు తీరితే నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంబరపడతారు.

మరి ఈ వార్త కనుక నిజం అయితే నందమూరి అభిమానులకు ఇక పండుగ అని చెప్పవచ్చు.

తాజా వార్తలు