నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.
ఇంకా ప్రధానమైన విషయం ఏంటీ అంటే విలన్ గా కూడా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.గతంలో ఎన్టీఆర్ ఈ ప్రయోగాన్ని చేశాడు.
జై లవకుశ సినిమా తో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పడు కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడు ఎన్టీఆర్ ను ఫాలో అయ్యాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ అన్నయ్య కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగాలు ప్రస్తుత హీరోల్లో ఏ ఒక్కరు చేయలేదు అన్నాడు.నిజమే కళ్యాణ్ రామ్ ఓమ్ త్రీడి మూవీ మొదలుకుని ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించాడు.
నటించడం మాత్రమే కాకుండా నిర్మించాడు.
ఒక హీరో ఈ స్థాయిలో ప్రయోగాలు చేయడం ఇదే ప్రథమం.కనుక కళ్యాణ్ రామ్ చాలా గొప్ప హీరో అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీ లో హీరోగా కళ్యాణ్ రామ్ తనదైన మార్క్ ను చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే ప్రయోగాల్లో కంటెంట్ మాత్రం లోపిస్తుంది అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కమర్షియల్ గా బిగ్ హిట్స్ అందుకున్నది చాలా తక్కువ.
కనుక ప్రయోగాలతో పాటు కంటెంట్ విషయంలో కూడా దృష్టి పెట్టాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.
మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే మరో వారం ఆగాల్సిందే.అమిగోస్ లో కళ్యాణ్ రామ్ నెగటివ్ షేడ్స్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.