సినిమా ఇండస్ట్రీలో, పాలిటిక్స్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీకి సొంతమనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలలో మూడు పాత్రలలో నటించి మెప్పించడం గమనార్హం.
అధినాయకుడు సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రలలో నటించి మెప్పించారు.అధినాయకుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా బాలయ్య నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన జై లవకుశ సినిమాలో నటించారు. జై, లవ, కుశ పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ నటించగా ఈ మూడు పాత్రలలో తారక అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం.
ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు 80 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
జై లవకుశ సినిమాలో తారక్ ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.ఈ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు అవుతున్నా ఈ సినిమాలో తారక్ నటనను సులువుగా మరిచిపోలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించారు.
అమిగోస్ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రల్లో కనిపిస్తున్నారు.ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు సినిమాలో మూడు పాత్రల్లో వేర్వేరు సినిమాలలో నటించడం ప్రపంచంలోనే రికార్డ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో కలిసి నటించకపోయినా తారక్ హీరోగా తెరకెక్కిన సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నందమూరి హీరోలు కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.