నందమూరి బాలకృష్ణ( Nandhamuri Balakrishna ) బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహా రెడ్డి( Akhanda,Veerasimha reddy movies ) సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన వీర సింహారెడ్డి సినిమా వంద కోట్ల వసూళ్లకు పైగా రాబట్టడంతో తదుపరి సినిమాపై అంచనాలు ఆశాన్ని తాకేలా ఉన్నాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil ravipudi ) దర్శకత్వంలో బాలయ్య సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా మొదలు కాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరగడం లేదు.
ఇప్పటి వరకు టైటిల్ ను కూడా ప్రకటించలేదు.అంతే కాకుండా సినిమా గురించి ఇతర ఎలాంటి ప్రకటనలు లేవు.
దాంతో చిత్ర యూనిట్ సభ్యుల పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఏం చేస్తున్నాడు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమా యొక్క ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అంటూ నందమూరి అభిమానులు పెదవి విరుస్తున్నారు.ఇలాంటి దర్శకుడిని ఎప్పుడు చూడలేదు.సినిమా ప్రారంభించిన వెంటనే సినిమా యొక్క హడావుడి మొదలు అవ్వాల్సి ఉంటుంది.కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క టైటిల్ ని కూడా ప్రకటించక పోవడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆ విషయాన్ని కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం సినిమా ను ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
వచ్చే నెలలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యేనా చూడాలి.