Nandamuri Chaitanya Krishna : సమరసింహారెడ్డి డైలాగ్ ను కూనీ చేసిన చైతన్యకృష్ణ.. ట్రోల్స్ మామూలుగా లేవుగా!

ఇటీవల కాలంలో నందమూరి చైతన్య కృష్ణ( Nandamuri Chaitanya Krishna ) సినిమాలకు సంబంధించి కొన్ని సన్నివేశాలు విపరీతంగా ట్రోలింగ్స్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే.ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేసిన ఫైట్స్, నడిచిన నడక ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ట్రోలింగ్ జరుగుతోంది.

 Nandamuri Chaitanya Krishna Samarasimha Reddy Dialogue-TeluguStop.com

ఇక చైతన్య కృష్ణ బ్రీత్ సినిమా( Breathe Movie ) అయితే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.జీరో షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఒక్క టికెట్ కూడా తెగలేదని నెట్టింట్లో విమర్శలు కనిపించాయి.ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో చైతన్య కృష్ణ మాట్లాడిన మాటల ప్రభావం చాలా గట్టిగానే కనిపించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇప్పుడు నందమూరి చైతన్య కృష్ణ ఒక ఫంక్షన్‌కు హాజరయ్యారు.సమర సింహా రెడ్డిని( Samarasimha Reddy ) రీ రిలీజ్ చేయబోతోన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో చైతన్య కృష్ణ పాల్గొనడంతో పాటు స్టేజ్ మీద ఆయన చెప్పిన డైలాగులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే అది కేవలం బాబాయ్‌ వల్లే అవుతుంది.

ఆయనలా ఇంకెవ్వరూ డైలాగ్స్ చెప్పలేరని, మరే ఇతర హీరోలకు కూడా సాధ్యం కాదంటూ ఇలా ఏదేదో చెప్పుకుంటూ పోయాడు.అయితే చైతన్య కృష్ణ మాత్రం సమర సింహా రెడ్డిలోని డైలాగ్( Samarasimha Reddy Dialogue ) చెప్పేందుకు ఆపసోపాలు పడ్డాడు.

నీ ఇంటికొచ్చా.నీ నట్టింటికొచ్చా అంటూ చైతన్య కృష్ణ డైలాగ్ చెప్పేందుకు తడబడ్డాడు.పక్కన యాంకర్ ప్రాప్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయాడు.మధ్యలో డైలాగ్ ఏంటి? మర్చిపోయాను అని చేతులెత్తేశాడు.చైతన్య కృష్ణ అలా డైలాగ్ చెప్పేందుకు నానా తంటాలు పడుతుంటే.వెనక, పక్కన ఉన్న వాళ్లు తెగ నవ్వేసుకున్నారు.

చైతన్య కృష్ణ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తో పాటు నందమూరి అభిమానులు కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube