బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లాంచ్ పై స్పందించిన అనిల్ రావిపూడి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు తమ వారసులను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఈ ట్రెండ్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండే జరుగుతుంది.

 Nandamuri Balakrishna Son Nandamuri Mokshagna Launching Details, Nandamuri Balak-TeluguStop.com

ఇక వారసులను పరిచయం చేయడం ఆషామాషీ కాదు.అందుకోసం స్టార్స్ చాలా మంది దర్శకులతో చర్చలు జరుపుతారు.

ముందుగా వారు కథలను విని ఆ తర్వాత తమ వారసులు ఆ సినిమాతో సక్సెస్ అవ్వగలరా లేదా అని అలోచించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.

ఇక ఇప్పుడు మన టాలీవుడ్ లో ఇంకా ఎంట్రీ ఇవ్వాల్సిన వారిలో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఉన్నాడు.

బాలయ్య తన వారసుడును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు బాలయ్య ఏ డైరెక్టర్ తో తన కుమారుడు ఎంట్రీ ని ప్లాన్ చేయాలో ఫిక్స్ కాలేక పోయాడు.

అయితే ఈ విషయంలో ఇటీవల కాలంలో చాలా మంది డైరెక్టర్ల పేరు వినిపించింది.మరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వినిపించిన డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి కూడా ఒకరు.

Telugu Anil Ravipudi, Balakrishna Son, Mokshagnaanil, Mokshagna Debut, Nandamuri

గత కొద్దీ రోజుల క్రితం అనిల్ రావిపూడి ని బాలయ్య తన కొడుకు లాంచింగ్ కోసం ఫిక్స్ చేసినట్టు టాక్ వచ్చింది.టాలీవుడ్ లో వరుస హిట్లు కొడుతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. బాలయ్య కొడుకును అనిల్ రావిపూడి చేతిలో పెట్టాలని డిసైడ్ అయినట్టు టాక్ వినిపించింది.

Telugu Anil Ravipudi, Balakrishna Son, Mokshagnaanil, Mokshagna Debut, Nandamuri

కానీ ఈ రూమర్ పై అనిల్ తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు.అనిల్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ను లాంచ్ చేయడం లేదని అవన్నీ ఫేక్ వార్తలు అని ఖండించాడు.దీంతో బాలయ్య తన వారసుడి లాంచింగ్ కోసం మళ్ళీ వేట కొనసాగుతుంది అని తెలుస్తుంది.

ఇటీవలే ఎఫ్ 3 తో సక్సెస్ కొట్టిన అనిల్ నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube