మా బాలయ్య బాబు తోపు అంతే..!

సోషల్‌ మీడియా ఇంత పరిధి లేనప్పటి నుండే బాలయ్య పై విమర్శలు వస్తూనే ఉండేవి.

దాదాపు పుష్కర కాలం క్రితం బాలయ్య ను విమర్శించేందుకు కొందరు యాంటీ ఫ్యాన్స్ ఒక ప్లాట్‌ ఫామ్‌ నే ఏర్పాటు చేశారు.

అంతటి యాంటీ ఫ్యాన్స్ ఉన్న బాలయ్య అంతకు మించి వీరాభిమానులను కలిగి ఉన్నాడు.బాలయ్య అంటే చెవులు ముక్కు ఏది పడితే అది కోసుకోవడం మాత్రమే కాకుండా అవతలి వారికి కూడా కోసేందుకు సిద్దంగా ఉన్న అభిమానులు ఉన్నారు.

Nandamuri Balakrishna Fans Counter Attack On Anti Fans , Akhanda Movie, Balakris

ఇప్పుడు ఇది అంతా ఎందుకు అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటీ అంటే రేపు ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా అభిమానుల కోసం శ్రీరామ దండకంను విడుదల చేయబోతున్నట్లుగా బాలయ్య అధికారికంగా ప్రకటించాడు.

గత ఏడాది శివ శంకరి తో వచ్చిన బాలయ్య ఈ ఏడాది శ్రీరామ దండకంతో రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రావడంతో ఇక బాలయ్య యాంటీ ఫ్యాన్స్ మొదలు పెట్టారు.బాలయ్య ఎందుకయ్యా మాకు ఈ కర్మ అంటూ కొందరు.

Advertisement

ముందే టైమ్‌ ప్రకటించి బతికించావు.ఆ సమయంకు మేము ఎటైనా పారిపోతాం అంటూ కామెంట్స్ పెట్టడంతో బాలయ్య అభిమానులు సీరియస్ అయ్యారు.

శివ శంకర్ పాటను కొందరు విమర్శలు చేశారు.కాని ఆయన మాదిరిగా పాడేందుకు ఏ ఒక్కరు కూడా ప్రయత్నించగలరా.

కనీసం ఆయన చెప్ప ఏవిధంగా చిన్న స్లోకం అయినా మీ మ్యాచ్‌ హీరోలు చెప్తారా అంటూ బాలయ్య అభిమాన సంఘం నాయకులు నెట్టింట ప్రశ్నిస్తున్నారు.బాలయ్యను విమర్శించే అర్హత ఏ హీరో అభిమానికి లేదు అంటూ వారు అంటున్నారు.

నెట్టింట రేపు శ్రీరామ దండకం వైరల్‌ అవ్వడం ఖాయం.ప్రస్తుతం బతికి ఉన్న హీరోల్లో కేవలం బాలకృష్ణ మాత్రమే పౌరాణిక పాత్రలకు అర్హుడు మరియు ఆయన మాత్రమే చేయగలడు అంటూ బాలయ్య అభిమానులు అంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

మా బాలయ్య తోపు.ఆయన గురించి విమర్శలు చేస్తే నడి రోడ్డు మీద ఊడదీసి కొట్టేస్తాం అంటూ నెట్టింట హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు