బాలకృష్ణ కామెంట్స్.అసెంబ్లీలో జరిగిన ఘటన ఎంతో బాధాకరం.
నియంతృత్వ ధోరణిలో శాసనసభ జరగడం చాలా బాధ కలిగించే విషయం.రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుంది.
ఆధారాలు లేకుండా స్కిల్ డేవేలప్మెంట్ కేసు పెట్టారు.ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి కక్ష పూరితంగా సీఎం వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబుకు వస్తున్న స్పందన, యువ గళంకు వస్తున్న ఆదరణ చూసి కేసు పెట్టారు.ఎక్కడా అభివృద్ధి లేదు.
యువతకు ఉపాధి లేదు.ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు.
చంద్రబాబు ను జైల్లోకి పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారు.రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.
అంతా సక్రమంగా జరిగిందని గతంలో కోర్టు కూడా చెప్పింది.
రాజకీయ కక్ష సాధింపు లో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
ఇలాంటి సంక్షోభాలు గతంలో చాలా చూసాం.చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు…వ్యవస్థలపై విప్లవం రావాలి.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.అమరావతి ఉద్యమంలో జూనియర్ ఆర్టిస్టులు వస్తే…విశాఖ పెట్టుబడుల సదస్సుకు వచ్చిన వారు ఎవరు?స్కిల్ డేవేలప్మెంట్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదు.రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు.పార్టీ కార్యకర్తలే కాదు… జనం కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చింది.అంబటి రాంబాబు మీసం మెలిసి తొడ గొట్టాడు.నేను కూడా తేల్చుకుందాం రా అన్నాను.
నా తల్లి లాంటి వృత్తిని అవమానించాడు.కేసులకు భయపడేది లేదు.
నేను ముందుకొస్తానని వాళ్ళు ఊహించలేదు.